ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:54 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

చదువుతో పాటు చట్టాలపై అవగాహన అవసరం: చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పి. రవి ఎంజేపీ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు పాఠశాల భోజనం, వంటగది నాణ్యతను పరిశీలించిన జడ్జి

చెన్నూర్(మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 24:

విద్యార్థులు పాఠశాల దశ నుంచే దేశంలోని చట్టాలు, భారత న్యాయస్థానాల పనితీరుపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని చెన్నూర్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పి. రవి సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలోని ఎంజేపీ మహాత్మా జ్యోతిబా పూలే బాలుర కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్జి పి. రవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సదస్సుకు ముందు జడ్జి పాఠశాలలోని వంటగది, పరిసరాల పరిశుభ్రతను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని నేరుగా విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.